మీరు వేయబోయే సెప్టెంబర్2018 3B రిటర్న్ చాలా చాలా కీలకమయినది. గత సంవత్సరంలో చేసిన పొరపాట్లను సర్దుబాటు చేసుకునే అవకాశం ఈసెప్టెంబర్ 3B తో అయిపోతుంది. ఇందులో కనుక పోర్క్పాటు కానీ లేదా తప్పుకానీ చేస్తే మీరు సరిదిద్దుకోలేరు. కనుక, జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని అక్టోబర్20 లోపల వేయవచ్చు. ఒకవేళ కుదరకపోయినచో కొంత ఆలస్యంగానైనా వెయ్యండి కానీ తప్పుగా వేయకండి. ఇంకొక విషయం ఏమిటంటే 31st మార్చి కల్లా ఆ adjustments ని books లో చూపించండి. సెప్టెంబర్ 3బి లో చూపించిన దానిని GSTR1 లో కూడా చూపించవలసివచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. చూసి సరిగా వేసుకోవాల్సింది. మనం చూపే ఈ ADJUSTMENTS ని Annual return GSTR9 లో కూడా చూపాలి. జాగ్రత్తగా తయారుచేసుకోవలసింది.



